ఇరాక్ లో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటూ ఆందోళనలు

- September 06, 2018 , by Maagulf
ఇరాక్ లో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటూ ఆందోళనలు

బాగ్దాద్‌:ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో నిరసనలు వెల్లు వెత్తాయి. నీటి ఎద్దడి, నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటూ నిరసనకారులు ఆందోళన బాట పట్టారు. ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. బాస్రా నగరంలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. ఉమ్‌ఖస్రు పోర్ట్‌ వద్ద ఆందోళనకారులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతాబలగాలు బాష్పవాయుగోళాలు ప్రదర్శించాయి. ఈ ఘటనలో 25 మంది పౌరులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో తొలుత ఇరాక్‌ ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించి అనంతరం ఎత్తేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com