హజ్‌ తర్వాత సౌదీని విడిచి వెళ్ళిన మిలియన్‌కి పైగా ఫిలిగ్రిమ్స్‌

- September 07, 2018 , by Maagulf
హజ్‌ తర్వాత సౌదీని విడిచి వెళ్ళిన మిలియన్‌కి పైగా ఫిలిగ్రిమ్స్‌

జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ పాస్‌పోర్ట్స్‌ వెల్లడించిన వివరాల ప్రకారం 1,758,722 ఫారిన్‌ ఫిలిగ్రిమ్స్‌లో 1,001,783 ఫిలిగ్రిమ్స్‌ సెప్టెంబర్‌ 6 నాటికి దేశం విడిచి వెళ్ళారని తెలుస్తోంది. ఆగస్ట్‌ 19న డే ఆఫ్‌ అరాఫత్‌ సందర్భంగా 2.3 మిలియన్‌ ఫిలిగ్రిమ్స్‌ మక్కా సబర్బ్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సౌదీ అరేబియా కింగ్‌ సల్మాన్‌, హజ్‌ ఆర్గనైజేషన్‌ సమర్థతను ఈ సందర్భంగా అభినందించారు. ఫిలిగ్రిమ్స్‌ ప్రార్థనలు ఫలించి, ఫిలిగ్రిమ్స్‌ అంతా తమ స్వస్థలాలకు క్షేమంగా వెళ్ళాలని అల్లాని తాను ప్రార్థించినట్లు కింగ్‌ చెప్పారు. కింగ్‌ అలాగే క్రౌన్‌ ప్రిన్స్‌ ఇంటీరియర్‌ మినిస్టర్‌ ప్రిన్స్‌ అబ్దుల్‌ అజీజ్‌ బిన్‌ సౌద్‌ బిన్‌ నైఫ్‌ని హజ్‌ నిర్వహణపై అభినందించారు. సుప్రం హజ్‌ కమిటీ హెడ్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com