'ఎన్నారై' లకి ట్రంప్ మరో షాక్

- September 10, 2018 , by Maagulf
'ఎన్నారై' లకి ట్రంప్ మరో షాక్

అగ్రరాజ్యంగా పిలవబడే అమెరికాకి అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తరువాత తన తలతిక్క ప్రవర్తనతో అటు అమెరికాకి ఇటు అమెరికాలో స్థిరపడిన ఎన్నారైలకి పెద్ద తలనెప్పిగా మారిపోయాడు..అమెరికా అభివృద్దిలో ప్రముఖ పాత్ర పోషించేది కేవలం ఇతర దేశాల నుంచీ వలసలు వెళ్ళిన ఎన్నారైలే ఈ విషయం అందరికీ తెలిసిందే అయితే ట్రంప్ ఎన్నికల హామీల అమలులో భాగంగా హెచ్1 బీ పై విధించిన నిభందనలు అన్నీ ఇన్నీ కావు ఈ దెబ్బతో అమెరికాలో ఉన్న ఎన్నారైలు తట్టా బుట్టా సర్దేసుకోవడమే అనుకున్న సందర్భంలో ట్రంప్ మరొక పిడుగు లాంటి వార్తా వినిపించాడు అదేంటంటే..
 
అమెరికాలో శాశ్వత పౌరసత్వం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈబీ-5వీసా...ఈ వీసా కోసం హెచ్1 బీ వీసా దారులు ఎంతో పోటీ పడుతున్న సమయంలో ఈబీ-5వీసా పై కూడా నిభందనలు కఠినతరం చేయనున్నారని వార్తలు వెలువడ్డాయి...ఈ వీసా లో పెట్టుబడిని 5మిలియన్‌ డాలర్లకు పెంచనున్నారని అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు ఆరోన్‌ స్కాక్‌ చెబుతున్నారు. అయితే, పెట్టుబడి పెంపునకు సంబంధించి ఈ ఏడాది డిసెంబరు వరకూ ఎలాంటి మార్పు ఉండబోందని అంటున్నారు.
 
ఈ క్రమంలో శాశ్వత పౌరసత్వం కలిగే ఏకైక మార్గం ఈబీ-5వీసా కల కలగానే మిగిలిపోనుంది అంటున్నారు. కనీసం ఒక మిలియన్‌ డాలర్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా 10మంది అమెరికన్లకు ఉపాధి కల్పిస్తేఅ.. గ్రీన్‌కార్డును ప్రభుత్వం వారికి ఇస్తుంది అయితే..త్వరలో ఈబీ-5 విషయంలోనూ నిబంధనలకు కఠినతరం చేయనున్నారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com