దుబాయ్ లో 'సైమా' సందడి...
- September 16, 2018దుబాయ్:తెలుగు సినీ స్టార్స్ అంతా ఒకే చోట మెరిస్తే...ఆ ఆనందానికి హద్దులండవు. అలాంటిది దక్షిణ భారత దేశ తారాలోకం అంతా ఒకేచోట ప్రత్యక్షం అయితే...అక్కడ ఉండే సందడే వేరు. రెండు రోజులుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తారలతో కోలాహలంగా మారింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) ఏడో ఎడిషన్ కార్యక్రమం అక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెండు రోజుల వేడుకల్లో భాగంగా మొదటి రోజు మలయాళం, తమిళం భాషల్లో చిత్రాలకు వివిధ విభాగాల్లో 'సైమా' పురస్కారాలను అందించారు. రెండో రోజు శనివారం రాత్రి తెలుగు, కన్నడ స్టార్స్ అవార్డులు అందుకున్నారు. ముగింపు రోజున ప్రగ్యాజైశ్వాల్, ప్రణిత బృందాలు తమ నృత్యాలతో ఆహూతులను అలరించాయి. రాధిక శరత్‌కుమార్, భూమిక, భరత్ ఠాకూర్, సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, సింగర్ మధు ప్రియ మంగి శ్రీకాంత్ దంపతులు హాజరై ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ అవార్డుల్లో తెలుగు చిత్రసీమ నుంచి ఉత్తమ నటుడిగా 'బహుబలి'లో తన నటనకు ప్రభాస్‌కు అవార్డు వరించింది. ఉత్తమ నటుడు క్రిటిక్ పురస్కారాన్ని బాలకృష్ణ అందుకున్నారు. ఉత్తమ నటిగా కాజల్ అగర్వాల్ (నేనే రాజు నేనే మంత్రి) నిలిచింది.
ఉత్తమ చిత్రంగా బాహుబలి, ఉత్తమ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి(బాహుబలి) అవార్డులను అందుకున్నారు.ఈ కార్యక్రమాన్ని దుబాయ్ లో అంజన్ స్టార్ ఈవెంట్స్ సంస్థ లోకల్ ఈవెంట్ పార్టనర్‌గా వ్యవహరించింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి