వాట్సాప్ వినియోగదారులకు చేదువార్త
- September 20, 2018
పాత ఐఫోన్లను వినియోగిస్తున్నవారికి చేదువార్త! ఐవోఎస్ 7, ఇతర పాత వెర్షన్ల మీద నడిచే ఐఫోన్లలో వాట్సాప్ ఇక సపోర్ట్ చేయదు. ఇందులో భాగంగా వాట్సాప్ ఇప్పటికే ఉపసంహరణ విధానాలను ప్రారంభించింది. అయితే ఇది ఐఫోన్ 4 డివైస్‌లకు మాత్రం వర్తించదు. అంతేకాకుండా ఇది కూడా 2020 వరకు మాత్రమే పనిచేయనుంది. ఇప్పటికే వాట్సాప్ ను ఇన్స్టాల్ చేసుకున్న ఐఫోన్ 4 లలో మినహా ఐవోఎస్7 మీద నడిచే మిగితా అన్ని ఫోన్లలోనూ ఇక మీదట వాట్సాప్ పనిచేయదు. అంతేకాదు ఆయా ఫోన్లలో వాట్సాప్ దానంతట అదే డిలీట్ అయినా కూడా తిరిగి ఇన్స్టాల్ చేసుకోవడం కుదరదు.
దీనిపై వాట్సాప్ ప్రతినిధులు మాట్లాడుతూ..' పాత వెర్షన్లలో ఉన్న ఐఫోన్లకు వాట్సాప్‌లోని కొత్త ఫీచర్లు అందవు. వాట్సాప్‌లో తీసుకొస్తున్న అప్డేట్స్ కూడా ఆయా ఫోన్లకు వర్తించవు. అంతేకాకుండా ఇంతకుముందున్న ఫీచర్లు కూడా పనిచేయకుండా పోయేందుకు అవకాశం ఉంది. ఐవోఎస్ వెర్షన్7, ఇతర పాత వెర్షన్ ఐఫోన్లలో 1 ఫిబ్రవరి 2020 తర్వాత వాట్సాప్ సేవలను నిలిపివేయనున్నాం ' అని తెలిపారు.
ఇప్పటికే నోకియా సింబియాన్ ఎస్60, బ్లాక్‌బెర్రీ ఓఎస్, విండోస్ ఫోన్8.0లకు వాట్సాప్ తన సేవలను నిలిపి వేసింది. అంతేకాకుండా 1 ఫిబ్రవరి 2020 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.7లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







