ఆసియా కప్:నేడు భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్

- September 20, 2018 , by Maagulf
ఆసియా కప్:నేడు భారత్- బంగ్లాదేశ్ మ్యాచ్

దుబాయ్:ఆసియా కప్‌లో వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్‌ నేడు బంగ్లాదేశ్‌తో సూపర్‌ ఫోర్‌లో తొలి మ్యాచ్‌ను ఆడనుంది. పాక్‌తో జరిగిన మ్యాచ్‌కోసం జట్టులోకి వచ్చిన హార్ధిక్‌ పాండ్యా వెన్ను నొప్పితో ఆసియా కప్‌కు దూరమయ్యాడు. మరోవైపు స్పీడ్‌స్టార్‌ శార్ధూల్‌ ఠాకూర్‌, స్పిన్నర్‌ అక్సర్‌ పటేల్‌లు కూడా గాయాలతో ఉన్నారు. వీరు కూడా ఈ టోర్నీలో మిగిలిన మ్యాచుల్లో పాల్గొనే అవకాశంలేదు. పాండ్యా స్థానంలో దీపక్‌ చాహర్‌, అక్సర్‌ స్థానంలో రవీంద్ర జడేజా, శార్ధూల్‌ స్థానంలో సిద్ధార్థ్‌ కౌల్‌ను ఖరారు చేస్తూ బీసీసీఐ గురవారం ఒక ప్రకటన కూడా చేసింది. కాగా చివరి 11 మంది ఆటగాళ్లలో చాహర్‌కు అవకాశం దక్కుతున్నది అనుమానమే. పేసర్‌ భువనేశ్వర్‌కు విశ్రాంతి కల్పించి ఖలీల్‌ అహ్మద్‌కు అవకాశం కల్పించవచ్చు. మనీష్‌ పాండే మిడిల్‌ ఆర్డర్‌లో పాతుకు పోవడానికి అవకాశముండగా, కేదార్‌ జాదవ్‌ ఆఫ్‌ బ్రేక్స్‌తో పాండ్యా ఓవర్ల కోటాను పూర్తిచేస్తాడని అంచనా. ఇక ఓపెనర్లుగా రోహిత్‌, శిఖర్‌ ధావన్‌లు రాణిస్తుండగా, అంబటి, దినేష్‌లు కూడా ఫామ్‌లో ఉండి మరోసారి తమ సత్తాను చాటనున్నారు. ధోనీ బ్యాటింగ్‌ ఫామ్‌పై టీం మేనేజ్‌మెంట్‌ ఆందోళనగా ఉంది. భారత్‌, పాకిస్తాన్‌ల వైరం చారిత్రాత్మకంగా వస్తోండగా, తాజగా బంగ్లాదేశ్‌ జట్టు కూడా భారత్‌కు సవాలుగా మారింది. బంగ్లా వన్డే హోదా పొంది తనదైన శైలిలో రాణిస్తోంది. 2012 ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరి తన సత్తాను చాటింది. బంగ్లాదేశ్‌ జట్టును తక్కువ అంచనా వేస్తే. పప్పులో కాలేసినట్టే. మష్‌రఫె బిన్‌ ముర్తుజా నేతృత్వంలో ముష్‌ఫికర్‌ రహీం, షాకీబ్‌ అల్‌ హసన్‌, మహ్మదుల్లా రియద్‌లతో కూడిన ఆ జట్టు మంచి ఊపులో ఉంది. బంగ్లా పేసర్లు రహమాన్‌, రూబెల్‌ హుసెయిన్‌, స్పిన్నర్లు ముర్తుజా, షకీబ్‌లు మంచి ఫామ్‌లో ఉండటంతో భారత బ్యాట్స్‌మన్లు ఆచితూచి ఆడాల్సి ఉంటుందనటంలో సందేహం లేదు.
జట్లు: భారత్‌ : రోహిత్‌ శర్మ(కెప్టెన్‌) శిఖర్‌ ధావన్‌, అంబటి రాయుడు, దినేష్‌ కార్తిక్‌, ధోనీ, మనీష్‌ పాండే, కేదార్‌ జాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, సిద్ధార్థ్‌ కౌల్‌, కుల్దిdప్‌ యాదవ్‌, యజువేంద్ర చాహల్‌, రవీంద్ర జడేజా, దీపక్‌ చాహర్‌.
బంగ్లాదేశ్‌: మష్‌రఫె బిన్‌ ముర్తుజా (కెప్టెన్‌), షకీబ్‌ అల్‌ హసన్‌( వైస్‌ కెప్టెన్‌), తమీమ్‌ ఇక్బాల్‌, మహ్మద్‌ మిథున్‌, లిట్టన్‌ కుమార్‌ దాస్‌, ముష్‌ఫికర్‌ రహీం, అరిఫుల్‌ హక్‌, మహ్మదుల్లా, ముసద్దీక్‌ హుసేన్‌ సైకత్‌, నజముల్‌ హుసేన్‌ శాంతో, మెహిందీ హసన్‌ మిరాజ్‌, నజముల్‌ ఇస్లాం అపు, రూబెల్‌ హుసేన్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌, అబు హైదర్‌ రోని.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com