అరబ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్స్‌: మనామాకి 6వ ర్యాంక్‌

- September 21, 2018 , by Maagulf
అరబ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్స్‌: మనామాకి 6వ ర్యాంక్‌

మనామా:గ్లోబల్‌ ఫైనాన్స్‌ సెంటర్స్‌ ఇండెక్స్‌ (జిఎఫ్‌సిఐ ఇండెక్స్‌) ర్యాంకింగ్స్‌లో మనామా ప్రపంచ స్థాయిలో 59వ ర్యాంక్‌ దక్కించుకోగా, అరబ్‌ ప్రపంచంలో 6వ ర్యాంక్‌ని సొంతం చేసుకుంది. వరల్డ్‌ బ్యాంక్‌, ఎకనమిక్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌, వంటి ప్రముఖ సంస్థలు ఈ అస్సెస్‌మెంట్‌లో పాల్గొన్నాయి. బిజినెస్‌ఎన్విరాన్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ సెక్టార్‌ డెవలప్‌మెంట్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, హ్యూమన్‌ క్యాపిటల్‌, పబ్లిక్‌ ఫ్యాక్టర్స్‌ వంటి అంశాల్ని ఈ ర్యాంకింగ్స్‌ కోసం పరిగణనలోకి తీసుకున్నారు. ఈ ర్యాంకింగ్స్‌లో దుబాయ్‌కి అరబ్‌ వరల్డ్‌లో మొదటి స్థానం దక్కగా, గ్లోబల్‌ ఇండెక్స్‌లో 15వ స్థానం దక్కింది. అబుదాబీ వరల్డ్‌ ర్యాంకింగ్‌ 26 కాగా, అరబ్‌ వరల్డ్‌ ర్యాంకింగ్‌ 2. న్యూయార్క్‌ సిటీ వరల్డ్‌ ఇండెక్స్‌లో తొలి స్థానం దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానం లండన్‌ దక్కించుకుంది. హాంగ్‌ కాంగ్‌, సింగపూర్‌, షాంఘై తదుపరి స్థానాల్లో నిలిచాయి.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com