మౌంటెయిన్స్ పైనుంచి పడి మహిళ మృతి
- September 22, 2018
ఆసియాకి చెందిన ఓ మహిళ, రస్ అల్ ఖైమాలోని ఓ మౌంటెయిన్ నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది. రస్ అల్ ఖైమా కాంప్రహెన్సివ్ పోలీస్ స్టేషన్స్ చీఫ్ బ్రిగేడియర్ సులైమాన్ మొహమ్మద్ అల్ కిజి మాట్లాడుతూ, ఘాలియా మౌంటెయిన్ మీదికి తన భర్త, ఇతర స్నేహితులతో కలిసి వెళ్ళినప్పుడు ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 2.30 నిమిషాల సమయంలో ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందనీ, వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశామని చెప్పారు. ట్రెక్కర్స్ ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలనీ, శాటిలైట్ ఫోన్ వంటి సౌకర్యాల్ని సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. తగిన శిక్షణ లేకుండా ట్రెక్కింగ్‌కి వెళ్ళడం ప్రమాదకరమని బ్రిగేడియర్ అల్ కిజి చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!