ఏ.పి సీఎం చంద్రబాబునాయుడుకు ఘనస్వాగతం
- September 24, 2018
యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో జరిగే వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకోసం అమెరికాకు వచ్చిన చంద్రబాబు నాయుడుకు అక్కడ ఘనస్వాగతం లభించింది. చంద్రబాబుపై ప్రత్యేక అభిమానంతో ఎన్నారై తెలుగువాళ్ళు, ఎన్నారై టీడిపి సభ్యులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
ఎన్నారై టీడీపీ కార్యక్రమాలను చంద్రబాబు కొనియాడారు. ఇటీవలే అమెరికాలో లోకేష్ ఆధ్వర్యంలో మహానాడు విజయవంతం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే స్పూర్తిని ఇకపై కూడా కొనసాగించాలన్నారు. ఎన్నారై టిడిపిలో సభ్యులైన వారంతా సోషల్ మీడియా వేదికగా పార్టీ కోసం పనిచేయాలన్నారు. మళ్లీ టీడీపీని గెలిపించడం చారిత్రాత్మక అవసరం అని చంద్రబాబు ఎన్ఆర్ఐలకు పిలుపు ఇచ్చారు.
అమెరికాలో రెండో రోజూ చంద్రబాబు బిజిబిజీగా గడిపారు. సాయంత్రం ఆరు గంటల నుంచి వరుస కార్యక్రమాలతో బిజీ అయ్యారు. డీప్ ఓషియన్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి లిజ్ టేలర్‌తో సమావేశమయ్యారు. సముద్ర గర్భంలో నిక్షిప్తమైన సంపదను కనుగొనే సాంకేతిక పరికరాల తయారీ సంస్థగా డోయర్ మెరైన్ పేరొందింది. ఏపీలో 974 కిలోమీటర్లకు పైగా కోస్తా తీరం, సముద్ర ఉత్పత్తులలో దేశం అగ్రగామిగా ఎదిగేందుకు గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు వివరించారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యుఎన్ ఉమెన్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఆ తరువాత రిటైల్ బ్యాంకింగ్ సంస్థ బీఎన్పీ పరిబాస్ CEO జీన్ లారెంట్ బొన్నాఫే తో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరించారు..
మరోవైపు ప్రపంచబ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్‌తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాక్ ఫెలర్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాజీవ్ షాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మధ్యాహ్నం నుంచి విరామం లేకుండా చంద్రబాబు వరుసగా ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. భారత కాలమాణం ప్రకారం అర్థరాత్రి ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగే కీలక సదస్సులో చంద్రబాబు ప్రసంగిస్తారు. ప్రపంచ ఆర్థిక వేదిక, బ్లూంబర్గ్ గ్లోబల్ బిజినెస్ ఫోరం సంయుక్తంగా నిర్వహిస్తున్న సుస్థిర అభివృద్ధి-ప్రభావ సదస్సుల్లో పాల్గొంటారు. ఐక్యరాజ్యసమితి సదస్సులో కీలక ప్రసంగాలు చేసే తొమ్మిదిమంది ప్రముఖులలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉన్నారు. సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత-అంతర్జాతీయ సవాళ్లు, అవకాశాలు అనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన ప్రసంగం చేయనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







