విజయవంతంగా ముగిసిన మంత్రి నారా లోకేష్‌ విదేశీ పర్యటన

- September 26, 2018 , by Maagulf
విజయవంతంగా ముగిసిన మంత్రి నారా లోకేష్‌ విదేశీ పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానంతో న్యూ చాంపియన్స్ వార్షిక సమావేశాల్లో పాల్గొనేందుకు ఈ నెల16న చైనా వెళ్లిన నారా లోకేష్… స్వదేశానికి తిరిగొచ్చారు. ఈ పర్యటనలో భాగంగా.. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారాయన. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన వాతావరణాన్ని వారికి వివరించారు. రాష్ట్రంలో పెట్టాలంటూ.. పలు ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలను ఆహ్వానించారు. సానుకూలత వ్యక్తం చేసిన కంపెనీలతో ఎంఓయూ కుదుర్చుకున్నారు.

ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల తయారీ సంస్థలు, ఐటీ సంస్థల సీఈఓలతో చర్చలు, వరల్డ్‌ ఎకనామిక్‌ పోరం చర్చలతో… చైనా పర్యటన ఆద్యంతం.. క్షణం తీరిక లేకుండా గడిపారు లోకేష్‌. ఈ సందర్భంగా చైనా తెలుగు అసోసియేషన్‌ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఏపీని 2029 నాటికి ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాల్లో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నామని, చైనాలోని ప్రసావాసాంధ్రులు సహకరించాలని కోరారు. అంతకు ముందు బీజింగ్‌లో cetc, అన్హోన్‌, రైసెన్‌ ఎనర్జీ, సన్నీ ఆప్టికల్స్‌ సంస్థల ప్రతినిధులతో లోకేశ్‌ చర్చలు జరిపారు. షియామీ సప్లయర్స్‌ మీట్‌లో పాల్గొని ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ఆధ్వర్యంలో టియాంజిన్‌ వేదికగా జరిగిన పలు సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. అనంత‌రం హిర్ టెక్నాల‌జీస్‌ సహా వివిధ సంస్థల ప్రతినిధుల‌తో భేటీ అయ్యారు. ఎలక్ట్రానిక్స్‌ తయారీ లో ఉన్న HCTG కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. టియాంజిన్‌లో వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోరం వేదిక‌గా జ‌రిగిన ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌కు ప్రపంచ స‌హ‌కారం అనే అంశంపై జ‌రిగిన స‌మావేశానికి మంత్రి హాజ‌ర‌య్యారు. హెచ్ పి కంపెనీ చీఫ్ ఆర్కిటెక్ట్ క్రిక్ తో సమావేశమైన మంత్రి లోకేష్ రియల్‌ టైమ్‌ గవర్నెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ అంశాల్లో సహకారం అందించాలని కోరారు.

ఇక, లోకేశ్‌ చైనా పర్యటనలో అతిపెద్ద ఒప్పందం కుదిరింది. టీవీలు, స్మార్ట్‌ఫోన్లు, వాషింగ్‌ మెషిన్లు, ఫ్రిజ్‌ల తయారీలో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన టీసీఎల్‌ కంపెనీని ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించడంలో సఫలమయ్యారు. ఈ మేరకు ఆ సంస్థలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టీసీఎల్‌ కంపెనీల్లో 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇలాంటి కంపెనీని రాష్ట్రానికి తీసుకు రావడంలో లోకేశ్‌ కీలక పాత్ర పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టిసిఎల్ కంపెనీలలో 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com