60 గెటప్స్‌లో బాలకృష్ణ
- September 26, 2018
నందమూరి తారక రామారావు జీవిత కథతో బాలయ్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్. క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకుడు. ఈ క్రేజీ మూవీని బాలకృష్ణతో కలసి సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కెరీర్లో ఇదే హై బడ్జెట్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ బయోపిక్ వచ్చే సంక్రాంతికి విడుదలకాబోతుంది.
ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య 60 గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ విధ్యాబాలన్ కీ రోల్ పోషిస్తోంది. ఇక ఎఎన్ఆర్ గా సుమంత్ నటిస్తున్నాడు. అలాగే ఎస్.వి.ఆర్ గా నాగబాబు, చంద్రబాబు నాయుడుగా రానా, సావిత్రిగా నిత్యామీనన్, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ కనిపించబోతుంది. ఇంకా మిగిలిన పాత్రలకు ఫేమ్ ఉన్న వాళ్ళనే సెలక్ట్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ బయోపిక్ కోసం తెలుగు ప్రేక్షకులు మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పైగా స్టార్స్ కూడా ఇందులో కీ రోల్ పోషిస్తుండటతో అంచనాలు మరింత పెరిగాయి. అందుకే ఈ సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ఆల్ రెడీ కృష్ణా, వైజాగ్, కర్ణాటక రైట్స్ ని నిర్మాతల్లో ఒకరైన సాయి కొర్రపాటి తీసుకున్నారు. ఇక నైజాం రైట్స్ ని ఎషియన్ ఫిల్మ్ అధినేత సునీల్ దక్కించుకున్నారట. మిగతా ఏరియాలకు బిజినెస్ కి కూడా ఫుల్ డిమాండ్ ఉంది. మరి ఎన్టీఆర్ బయోపిక్ ఏ రేంజ్ లో సందడి చేస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







