సుప్రీం సంచలన తీర్పు..అలాంటి శృంగారం ఇకపై నేరం కాదు

- September 27, 2018 , by Maagulf
సుప్రీం సంచలన తీర్పు..అలాంటి శృంగారం ఇకపై నేరం కాదు

ఢిల్లీ:భారత సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇష్టపూర్వక శృంగారాన్ని నేరంగా పరిగణించడం రాజ్యాంగ విరుద్ధమంటూ పేర్కొంది. సెక్షన్‌ 497 ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లో పురాతన చట్టమని చిప్ జస్టిస్ దిపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. సమాజంలో మహిళలకు సమానహక్కులు కల్పించాలన్న స్ఫూర్తికి సెక్షన్‌ 497తో తూట్లు పడుతున్నాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. వారి అసమానతలకు అడ్డుపడే ఏ చట్టం అయినా సరే రాజ్యాంగపరమైనది కాదని వ్యాఖ్యానించింది. స్త్రీ, పురుషులంతా చట్టం ముందు సమానమాని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14,21 చెబుతోందని అలాంటప్పుడు ఈ సెక్షన్‌ను చెల్లబోదని పిటిషనర్‌ వాదించారు. పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన కొర్టు పరస్పర సమ్మతితో చేసే శృంగారం ఇకపై నేరం కాదంటూ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com