అతి వేగం: బేకరీలోకి దూసుకుపోయిన కారు

- September 28, 2018 , by Maagulf
అతి వేగం: బేకరీలోకి దూసుకుపోయిన కారు

మనామా: ఆలిలోని ఓ బ్యాకరీలో ఉద్యోగులు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. అతి వేగంతో ఓ కారు బ్యాకరీలోకి దూసుకురావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో బేకరీ పెద్దగా బిజీగా లేకపోవడం, ఉద్యోగులు ఇంకో వైపు వుండడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే 'రధ్వాన్‌ బ్యాకరీ'కి మాత్రం ఆస్థి నష్టం భారీగానే సంభవించింది. గ్లాస్‌ డోర్‌ని బద్దలుగొట్టుకుని కారు, బేకరీలోని పెద్ద టేబుల్‌ని ఢీకొట్టి ఆగిపోయింది. తాను ఆ సమయంలో స్టోరేజ్‌ ఏరియాలో వున్నాననీ, భారీ శబ్దం చోటు చేసుకోవడంతో ఆందోళనతో బయటకు వచ్చి ప్రమాదాన్ని గుర్తించానని ఓ ఉద్యోగి చెప్పారు. అరబ్‌ జాతీయుడైన డ్రైవర్‌, ఆ కారుని నడిపినట్లు పోలీసులు వెల్లడించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com