అమెరికా:16 వ వార్షిక గ్లోబల్ గీతా కాన్ఫరెన్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నిత్య

- September 29, 2018 , by Maagulf
అమెరికా:16 వ వార్షిక గ్లోబల్ గీతా కాన్ఫరెన్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నిత్య

అబుధాబి:పది వసంతాలైనా పూర్తిగా దాటలేదు.భగవద్గీతలోని 18 అధ్యాయాలు, అందులోని 700కు పైగా సంస్కృత శ్లోకాలు అతనికి కంఠతా వచ్చు. ఎక్కడ అడిగినా గడగడా చెప్పేస్తాడు. ఇటీవల అమెరికాలో జరిగిన 16 వ వార్షిక గ్లోబల్ గీతా కాన్ఫరెన్స్. (మర్యాద: అంతర్జాతీయ గీతా ఫౌండేషన్ ట్రస్ట్) సమావేశంలో తన ప్రతిభను ప్రదర్శంచాడు.మైసూరు దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే స్వర్ణ పతకం పొందాడు.

ఆ చిరంజీవి ఎవరోగాదు.జుఝవరపు నాగ వేణుగోపాల్, నాగ భార్గవిల కుమారుడు చి.నిత్య జుఝవరపు.అతని సోదరుడు వెంకట నాగ గణేశ్ ఇచ్చిన ప్రోత్సాహం మరువరానిది.భవిష్యత్తు లో మరిన్ని విజయాలు ఈ చిరంజీవి సాధించాలని "మాగల్ఫ్"ఆశిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com