వాడిన కారు టైర్ల అమ్మకాలపై కొరడా
- October 02, 2018
మస్కట్: వాడేసిన కారు టైర్లను విక్రయిస్తోన్న కంపెనీలు, స్టోర్లపై మస్కట్ మునిసిపాలిటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలు, స్టోర్లను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. బౌషర్‌లో మస్కట్ మునిసిపాలిటీ అర్బన్ ఇన్‌స్పెక్షన్ డిపార్ట్‌మెంట్, కారు టైర్లను లైసెన్స్ లేకుండా రీ-సైకిల్ చేస్తున్న సంస్థలపై దాడులు నిర్వహించడం జరిగింది. 2014లోనే కారు టైర్ల విషయమై పబ్లిక్ అథారిటీ ఫర్ కన్స్యుమర్ ప్రొటెక్షన్ స్పష్టంగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. మార్కెటింగ్, ఆక్షనింగ్, డిస్ట్రిబ్యూషన్‌కి సంబంధించి పాత టైర్లతో ఎలాంటి కార్యకలాపాలు చేయరాదని వాటిల్లో స్పష్టతనిచ్చారు. వాడిన టైర్లను సప్లయర్స్ వెంటనే ధ్వంసం చేయాల్సి వుంటుంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలుంటాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!