జనవరి 18న తెలంగాణ జాగృతి యువ నేతల సదస్సు.!

- October 02, 2018 , by Maagulf
జనవరి 18న తెలంగాణ జాగృతి యువ నేతల సదస్సు.!

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువనేతల సదస్సు 2019, జనవరి 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ సదస్సు.. మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సదస్సులో గాంధీజీ అనుసరించిన వ్యూహాలు, సిద్ధాంతాలతో సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను ఎలా చేరుకోవాలి అనే అంశంపై చర్చించనున్నారు. అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు అవసరమైన వినూత్న పద్ధతులపై చర్చించనున్నారు. ఈ సదస్సుకు 500లకు పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో పాటు స్వదేశానికి చెందిన ప్రముఖులు.. 60 మందికి పైగా సదస్సులో ప్రసంగించనున్నారు. ఇతర వివరాల కోసం https://www.tjiylc.com వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com