ప్రముఖ ద‌ర్శ‌కుడి ఆఫీసుకి బాంబు బెదిరింపు

- October 02, 2018 , by Maagulf
ప్రముఖ ద‌ర్శ‌కుడి ఆఫీసుకి బాంబు బెదిరింపు

ప్రముఖ సిని దర్శకుడు మణిరత్నం అఫిస్‌ను పేల్చేస్తామ‌ని ఓ ఆగ‌తంకుడు ఫోన్‌ చేసిన ఘటన కోలీవుడ్‌లో ఒక్కసారిగా కలకలం రేపింది. తాజాగా అర‌వింద్ స్వామి, విజ‌య్ సేతుప‌తి, శింబు,జ్యోతిక‌,ప్ర‌కాశ్ రాజ్ లాంటి ప్ర‌ధాన తారగాణంతో తెరకెక్కిన తమిళ చిత్రం చెక్క చివంత వానం. ఈ చిత్రానికి మణిరత్నం దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమా న‌వాబ్ టైటిల్‌తో విడుద‌ల అయింది. సెప్టెంబ‌ర్ 27న విడుద‌లైన ఈ చిత్రం ఇప్ప‌టికే తమిళ నాట 30 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రంలో కొన్ని అభ్యంత‌రక‌ర డైలాగులు ఉన్నాయి వాటిని తొల‌గించాల‌ని ఓ ఆగంత‌కుడు మణిరత్నం అఫిస్‌కు ఫోన్ చేశాడు. డైలాగుల‌ని తొల‌గించ‌క‌పోతే ఆఫీసుని పేల్చేస్తామ‌ని బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన అఫిస్ సిబ్బంది షోలీసులకు సమాచారం అందించారు.ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ ఎవరు చేశారనే దానిపై విచారణ జరుపుతున్నారు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com