యూత్ ఒలింపిక్ గేమ్స్ కోసం బహ్రెయిన్ తరఫున నలుగురు అథ్లెట్స్
- October 02, 2018
2018 సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్ కోసం బహ్రెయిన్ నలుగురు అథ్లెట్స్‌ని పంపనుంది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్లో ఈ పోటీలు జరుగుతాయి. యూనిస్ అహ్మద్ అనాన్, మర్వా ఇబ్రహీమ్ అల్ అజూజ్, మర్యామ్ మొహమ్మద్, అల్ నబీల్ దావాని బహ్రెయిన్ తరఫున మూడు విభాగాల్లో పోటీ పడతారు. అథ్లెటిక్స్, టెన్నిస్ మరియు వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో ఈ నలుగురూ టైటిల్ కోసం పోటీ పడనున్నారు. అథ్లెటిక్స్‌లో అనన్, మర్వా పోటీ పడ్తారు. అనన్ మెన్స్ 400 మీటర్స్ విభాగంలో, మార్వా విమెన్స్ 100 మీటర్స్ విభాగంలోనూ పోటీ పడబోతున్నారు. మొత్తంగా ఈ పోటీల్లో 4,000 మంది అథ్లెట్స్ టైటిల్ కోసం పోటీ పడతారు. 206 దేశాల నుంచి ఆటగాళ్ళు తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఆసియా వెలుపల జరుగుతున్న తొలి సమ్మర్ యూత్ ఒలింపిక్ గేమ్స్‌గా వీటికి మరో ప్రత్యేకత వుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!