నవంబర్ 9న దుబాయ్ విమెన్స్ ట్రయథ్లాన్
- October 02, 2018దుబాయ్: గత ఏడాది నవంబర్‌లో జరిగిన తొలి ఎడిషన్ దుబాయ్ విమెన్స్ ట్రయథ్లాన్ ఘనవిజయం సాధించడంతో, సెకెండ్ ఎడిషన్‌ని ఇంకా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబర్ 9న సెకెండ్ ఎడిషన్ దుబాయ్ విమెన్స్ ట్రయథ్లాన్ని నిర్వహించబోతున్నారు. యూఏఈ నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్, మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ నాలెడ్జ్ ఫౌండేషన్ ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్‌మక్తౌమ్ నేతృత్వంలో ఈ ఈవెంట్ జరుగుతుంది. 16 ఏళ్ళ పైబడిన మహిళలు ఈ ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు అర్హులు. సూపర్ స్ప్రింట్, స్ప్రింట్, ఒలింపిక్ డిస్టెన్స్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. రెండో ఎడిషన్ విమెన్స్ ట్రయథ్లాన్ నిర్వహిస్తుండడం చాలా ఆనందంగా వుందని ఈవెంట్స్ ఆర్గనైజింగ్ కమిటీ హెడ్ లామియా అబ్దుల్అజీజ్ఖాన్ చెప్పారు. దుబాయ్ లేడీస్ క్లబ్లో ఈ ఈవెంట్ జరుగుతుంది. 400 మీటర్స్ స్విమ్మింగ్, 10 కిలోమీటర్ల సైక్లింగ్, 2.5 కిలోమీటర్ల రన్ సూపర్ స్ప్రింట్‌లో భాగం. స్ప్రింట్‌లో 750 మీటర్ల స్విమ్మింగ్, 20 కిలోమీటర్ల సైక్లింగ్, 5 కిలోమీటర్ల రన్ వుంటుంది. ఒలింపిక్ డిస్టెన్స్‌లో 1.5 కిలోమీటర్ల స్విమ్మింగ్, 40 కిలోమీటర్ల సైక్లింగ్, 10 కిలోమీటర్ల రన్ వుంటుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి