యూఏఈ న్యూ వీసా సిస్టమ్‌..

- October 04, 2018 , by Maagulf
యూఏఈ న్యూ వీసా సిస్టమ్‌..

యూఏఈ:ప్రస్తుతం అమల్లో వున్నట్లుగా 3,000 దిర్హామ్‌ల డిపాజిట్‌ స్థానే, ఒక్కో వర్కర్‌కీ కేవలం 60 దిర్హామ్‌ల ఇన్స్యూరెన్స్‌ స్కీమ్‌ని యూఏఈలో ప్రైవేటు కంపెనీలు త్వరలో అందిపుచ్చుకోనున్నాయి. మినిస్ట్రీ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌, లోకాస్ట్‌ ఇన్స్యూరెన్స్‌ స్కీమ్‌ని మిడ్‌ అక్టోబర్‌ నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది. జూన్‌లో జారీ చేసిన కొత్త క్యాబినెట్‌ డెసిషన్‌ నేపథ్యంలో, ఒక్కో వర్కర్‌కీ 20,000 దిర్హామ్‌ల కవర్‌ చేసేలా స్కీమ్‌ అమల్లోకి రానుంది. ఇందులో సర్వీస్‌ బెనిఫిట్స్‌, వెకేషన్‌ మరియు ఓవర్‌టైన్‌ అలవెన్సెస్‌, అన్‌పెయిడ్‌ వేజెస్‌, రిటర్న్‌ ఎయిర్‌ టిక్కెట్స్‌, వర్క్‌ ఇంజ్యూరీస్‌లను ఈ స్కీమ్‌ కవర్‌ చేస్తుంది. దేశంలో కాస్ట్‌ ఆఫ్‌ డూయింగ్‌ని తగ్గించే క్రమంలో ఈ కొత్త స్కీమ్‌ని అమల్లోకి తెస్తున్నారు. మినిస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎమిరటైజేషన్‌ నాజర్‌ అల్‌ హామ్లి మాట్లాడుతూ, న్యూ స్కీమ్‌ ద్వారా వర్కర్స్‌ హక్కులు మరియు సేలరీస్‌కి భద్రత ఏర్పడుతుందని, అలాగే కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని చెప్పారు. మినిస్ట్రీ, దుబాయ్‌ ఇన్స్యూరెన్స్‌ కంపెనీతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ ద్వారా ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లో గ్రూప్‌ ఇన్స్యూరెన్స్‌ చేపడ్తారు.
  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com