కేరళ,తమిళనాడును ముంచెత్తిన వానలు
- October 05, 2018
తమిళనాడు, కేరళ, రాష్ట్రాలను భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో శుక్రవారం దక్షిణాది తీరంలో కుండపోత ప్రారంభమైంది. చెన్నైలోని కాంచీపురం, తిరువళ్లూరు.. కేరళలోని ఇడుక్కి, పాలక్కడ్, త్రిసూర్ జిల్లాలు.. అలాగే దక్షిణ కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
చెన్నై పరిసర ప్రాంతాల్లో పలు చోట్ల రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కుండపోతతో చెన్నైలో నేడు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు.అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో అక్టోబర్ 4 నుంచి 8వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం భారత వాతావరణ శాఖ ప్రకటించింకన సంగతి తెలిసిందే.
నిన్న మొన్నటిదాకా భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు.. తాజా వర్షాలతో మరో గండం పొంచి ఉంది. ఇడుక్కి, పాలక్కడ్, త్రిసూర్ జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. వర్షాలు ముంచెత్తుతుండటంతో మరోసారి కేంద్రం సహాయాన్ని కోరారు సీఎం పినరయి విజయన్. ఎన్‌డీఆర్ఎఫ్ సహాయక బృందాలను రాష్ట్రానికి పంపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వరద నీటిని విడుదల చేసేందుకు త్రిసూర్, పాలక్కడ్ జిల్లాలోని పలు డ్యామ్స్ గేట్లను కూడా తెరిచారు.
ఇక తమిళనాడులోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అసవరమైన సహాయక చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







