వలసదారుడి హత్య కేసులో ఒమన్ జాతీయుడి అరెస్ట్
- October 05, 2018
ఒమన్:నార్త్ బతినాలో ఓ వలసదారుడి హత్య కేసులో ఒమన్ జాతీయుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వలసదారుడ్ని వాహనంతో ఢీకొని, సంఘటనా స్థలం నుంచి నిందితుడు పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్‌తో కలిసి విస్తృతమైన సోదాలు నిర్వహించడంతో నిందితుడి ఆచూకీ దొరికిందని సహామ్ పోలీసులు వెల్లడించారు. సంఘటనా స్థలంలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వుంటే బతికేవాడనీ, సకాలంలో అతనికి వైద్య చికిత్స అందకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
Four expat workers found dead at shipping port in Oman
ఒమన్ షిప్పింగ్ పోర్టులో నలుగురు వలసదారుల మృతి
ఓ షిప్‌ని క్లీన్ చేస్తుండగా, అందులో ఇరుక్కుపోయి నలుగురు వలస కార్మికులు మృతి చెందినట్లు ఒమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) పేర్కొంది. సలాలా పోర్టులో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన నలుగురూ ఆసియా జాతీయులని పిఎసిడిఎ వెల్లడించింది. షిప్‌ని క్లీన్ చేస్తుండగా నలుగురు కార్మికులు ఇరుక్కుపోయారని సమాచారం అందడంతో, పిఎసిడిఎ - హజార్డస్ మెటీరియల్స్ డీలింగ్ టీమ్ రంగంలోకి దిగి, వారి ఈచూకీని కనుగొన్నట్లు పిఎసిడిఎ వర్గాలు పేర్కొన్నాయి. వారిని సజీవంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా, అప్పటికే వారు మృతి చెందడం జరిగింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







