‘న్యాక్’ ఉచిత శిక్షణ..

- October 05, 2018 , by Maagulf
‘న్యాక్’ ఉచిత శిక్షణ..

గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు న్యాక్ ఉచిత శిక్షణ అందిస్తోంది. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగులకు వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) ప్రకటించింది. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న నిరుద్యోగులు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు. శిక్షణతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న అభ్యర్థులు ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్‌లు ఆరు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో న్యాక్ ఆఫీసులో సంప్రదించాలి. ఇతర వివరాలకు 79890 50888,83286 22455 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని న్యాక్ తెలియజేసింది.

అర్హతలననుసరించి కోర్సులు:

* పదోతరగతి పాస్, ఫెయిల్ అయిన అభ్యర్థులకు ప్లంబింగ్ అండ్ శానిటేషన్, పెయింటింగ్ అండ్ డెకరేషన్, వెల్డింగ్, ఎలక్ట్రికల్ అండ్ లైటింగ్, డ్రైవాష్ అండ్ సీలింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.

* ఇంటర్, ఐటీఐ విద్యార్హత ఉన్నవారికి ల్యాండ్ సర్వేయర్, జనరల్ వర్క్స్, సూపర్‌వైజర్ కోర్సుల శిక్షణకు దరఖాస్తు చేసుకోవచ్చు.

* డిగ్రీ విద్యార్హత ఉన్నవారు స్టోర్ కీపర్ కోర్సులో శిక్షణకు అర్హులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com