కామాంధులకు బలైన మహిళా జర్నలిస్టు
- October 08, 2018
రూస్: బల్గేరియాలో ఓ మహిళా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు దారుణంగా హత్యకు గురైంది. 30 ఏళ్ల విక్టోరియా మారినోవాను అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటన రూస్ పట్టణంలో జరిగింది. మారినోవా ఓ ఛానల్‌లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా పనిచేస్తోంది. యురోపియన్ యూనియన్ నిధుల్లో జరిగిన అవకతవకలపై ఆమె గత కొన్నాళ్లూగా కథనాలను రాస్తోంది. అయితే ఆమె మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ మారినోవా తలకు భారీ గాయాలు అయ్యాయి. ఊపిరి ఆడక ఆమె మృతిచెందినట్లు కూడా డాక్టర్లు తేల్చారు. హత్య చేయడానికి ముందు ఆ జర్నలిస్టును రేప్ చేశారని స్థానిక మీడియా పేర్కొన్నది. గత ఏడాది కాలంలో యూరోప్ దేశాల్లో జర్నలిస్టులు హత్యకు గురికావడం ఇది మూడవ ఘటన. బల్గేరియాలో పాపులర్ అయిన టీవీఎన్ ఛానల్‌లో మారినోవా పనిచేస్తున్నది. ఓ సైకియాట్రీ సెంటర్ వద్ద ఆమె మృతదేహం ఉన్న కారణంగా.. అక్కడున్న పేషెంట్ ఎవరైనా ఆమెపై దాడి చేసి ఉంటారా అన్న కోణంలోనూ విచారణ నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!