యూఏఈ టూర్‌ లోగో ఆవిష్కరణ

- October 08, 2018 , by Maagulf

దుబాయ్: నబూదా ఆటో మొబైల్స్‌ - ఆడి దుబాయ్‌ షోరూమ్‌లో, యూఏఈ టూర్‌ సుప్రీమ్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ, కొత్త లోగోనీ విన్నర్‌ ట్రోఫీనీ ఆవిష్కరించింది. సెవెన్‌ సైడెడ్‌లో ఈ లోగో ఆకర్షణీయంగా రూపొందింది. అబుదాబీ, దుబాయ్‌, షార్జా, అజ్మన్‌, ఫుజారియా, రస్‌ అల్‌ ఖైమా, ఉమ్‌ అల్‌ కువైన్‌ ఎమిరేట్స్‌ని ప్రతిబింబించేలా సెవెన్‌ సైడెడ్‌ లోగోని రూపొందించారు. దుబాయ్‌ టూర్‌, అబుదాబీ టూర్‌ని మెర్జ్‌ చేసి 2019లో దుబాయ్‌ టూర్‌ పేరుతో రేస్‌ని నిర్వహించబోతున్నారు. అబుదాబీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ దుబాయ్‌ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌, ఆర్‌సిఎస్‌ స్పోర్ట్‌తో కలిసి ఈ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 2 వరకు మొత్తం ఏడు ఎమిరేట్స్‌ని కలిపేలా ఈ రేస్‌ వుంటుంది. 5.5 కిలోల బరువుతో 24 క్యారెట్‌ గోల్డ్‌ ప్లేటెడ్‌ ట్రోఫీ చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది. అబుదాబీ స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ జనరల్‌ సెక్రెటరీ ఆరిఫ్‌ అల్‌ అవానీ, యూఏఈ సైక్లింగ్‌ ఫెడరేషన్‌ ప్రెసిడెంట్‌ ఒసామా అల్‌ షఫార్‌, ఆర్‌సిఎస్‌ స్పోర్ట్స్‌ డిఎంసిసి సిఇఓ ఎన్‌రికో ఫిలి, అల్‌ నబూదా ఆటోమొబైల్స్‌ ఆడి జనరల్‌ మేనేజర్‌ అలి అల్‌ నబూదా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com