తిరుచ్చి నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానానికి తప్పిన పెను ప్రమాదం...
- October 12, 2018
తిరుచ్చి నుంచి దుబాయ్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. 136 మంది ప్రయాణికులు ఉన్న ఈ విమానం టేకాఫ్ అవుతుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ప్రహరీ గోడను తాకుతూ వెళ్లింది. వెంటనే విమానశ్రయ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.
తమిళనాడు లోని తిరుచ్చి విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. అయితే విమానం తాకడంతో అక్కడ ఉన్న గోడ కుప్పకూలింది. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు వెంటనే విమానాన్ని ముంబయికి దారి మళ్లించారు. ముంబయి ఎయిర్‌పోర్టులో విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులను మరో విమానంలో ముంబాయి నుంచి దుబాయ్‌కి తరలించారు అధికారులు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!