ఉద్యోగులకు కరీమ్‌ అన్‌లిమిటెడ్‌ వెకేషన్‌

- October 12, 2018 , by Maagulf
ఉద్యోగులకు కరీమ్‌ అన్‌లిమిటెడ్‌ వెకేషన్‌

దుబాయ్:అపరిమితమైన వెకేషన్‌ హాలీడేస్‌ లభిస్తే, ఉద్యోగుల ఆనందానికి హద్దే వుండదు. దుబాయ్‌కి చెందిన రైడ్‌ హెయిలింగ్‌ సర్వీస్‌ కరీమ్‌, 'అన్‌ లిమిటెడ్‌ వేకేషన్‌' పాలసీని తమ కంపెనీలో ప్రవేశపెట్టింది. ప్రతి ఏడాదీ కావాల్సినన్ని రోజులు వెకేషన్‌ తీసుకునే అవకాశం ఈ సంస్థ కల్పిస్తోంది. అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్‌, విర్జిన్‌ గ్రూప్‌ ఇప్పటికే తమ ఉద్యోగులకు ఈ తరహా అవకాశం కల్పిస్తోంది. ఈ పాలసీ వెనుక లాజిక్‌ ఏంటంటే, బెస్ట్‌ టాలెంట్‌ని ఎట్రాక్ట్‌ చేయడమట. కొలీగ్స్‌ తీసుకునే ఓనర్‌షిప్‌ రెస్పాన్సిబిలిటీపై నమ్మకం వుంచుతామనీ, వర్క్‌ / లైఫ్‌ బ్యాలెన్స్‌ని మేండేట్‌ చేయబోమనీ, ప్రతి ఒక్కరూ ఎంపవర్డ్‌ ఫీల్‌ అవ్వాలనీ, తద్వారా మంచి ఫలితాలు వస్తాయనే ఈ నిర్ణయం అమలు చేస్తున్నామనీ కరీమ్‌ తమ బ్లాగ్‌లో పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com