అసోం రాజధానిలో బాంబు పేలుడు కలకలం

- October 13, 2018 , by Maagulf
అసోం రాజధానిలో బాంబు పేలుడు కలకలం

అసోం రాజధాని గువహటిలో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న సుఖ్‌లేశ్వర్‌ ఘాట్‌ దగ్గర.. సుమారు పన్నెండు గంటల సమయంలో ఆకస్మాత్తుగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ దాటికి నదీ తీరం వెంబడి ఉన్న ప్రహరీ గోడ కూలిపోయింది. పేలుడు శబ్దంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రజలంతా భయబ్రాంతులకు లోనయ్యారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్లున్న.. నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పేలుడుకు సంబంధించిన వివరాలను సేకరించారు. పేలుడు స్వభావాన్ని బట్టి ఇది విద్రోహ చర్య కాకపోవచ్చని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. క్లూజ్‌ టీమ్‌, బాంబ్‌ స్క్వాడ్‌ సాయంతో.. ఆధారాలు సేకరించారు. ప్రత్యక్ష సాక్షులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేసింది. ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోందని, ఆ తర్వాతే స్పష్టత వస్తుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com