హెయిర్‌ డై చేస్తుండగా మహిళకు కాలిన గాయాలు

- October 13, 2018 , by Maagulf
హెయిర్‌ డై చేస్తుండగా మహిళకు కాలిన గాయాలు

యూ.ఏ.ఈ:సెలూన్‌లో హెయిర్‌ డై చేయించుకున్న ఓ మహిళకు కాలిన గాయాలయ్యాయి. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. షార్జా మిస్‌డెమీనియస్‌ కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ఆసియన్‌ వర్కర్‌, పొరపాటు కారణంగా ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు ఆరోపించడం జరిగింది. ఆ మహిళ సూచన మేరకు హెయిర్‌ డై చేయడం జరిగిందనీ, ఇంతకు ముందు చాలామందికి చేసినట్లుగానే హెయిర్‌ డై చేయడం జరిగిందనీ, సెలూన్‌ నుంచి ఆ మహిళ బయటకు వెళ్ళినప్పుడు ఆమె మామూలుగానే వున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసియన్‌ వర్కర్‌ తన వాదనను విన్పించారు. అయితే హెయిర్‌ డై కోసం వినియోగించిన ఓ పదార్థం కారణంగానే మహిళకు కాలిన గాయాలయినట్లు ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ తేల్చింది. కేసు విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com