జర్నలిస్టు హత్య.. సౌదీ రాజును కలవనున్న అమెరికా మంత్రి
- October 16, 2018
సౌదీ: సౌదీ అరేబియా జర్నలిస్టు ఖషోగ్గి అదృశ్య కేసు తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో.. ఇవాళ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో.. సౌదీ రాజు కింగ్ సల్మాన్‌ను కలుసుకోనున్నారు. సల్మాన్‌ను కలిసిన తర్వాత పొంపియో.. టర్కీని కూడా విజిట్ చేయనున్నారు. రెండు వారాల క్రితం ఇస్తాంబుల్‌లోని సౌదీ కౌన్సులేట్‌కు వెళ్లిన తర్వాత ఖషోగ్గి అదృశ్యమయ్యారు. అయితే జర్నలిస్టు ఖషోగి హత్యకు గురైనట్లు స్థానిక మీడియా కథనాలు రాసింది. సౌదీ ఏజెంట్లు ఖషోగ్గిని హత్య చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కానీ సౌదీ మాత్రం ఆ ఆరోపణలను ఖండిస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగారు. దుష్ట హంతకులను పట్టుకుంటామని కూడా ట్రంప్ అన్నారు. ఖషోగ్గి హత్య కేసులో సౌదీ రాజు సల్మాన్‌తోనూ ట్రంప్ మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఆ హత్య గురించి తనకు ఏమీ తెలియదని కింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. అదృశ్యమైన ఖషోగ్గి అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్టు పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!