లాభాల బాటలో ఇన్ఫోసిస్
- October 16, 2018
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ అద్భుత ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో మార్కెట్ అంచనాలను మించి కంపెనీ ఫలితాలను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ టెక్నాలజీ రూ. 4110 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. మార్కెట్ విశ్లేషకులు రూ. 4048 కోట్లు అంచనా వేశారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 20,609 కోట్ల టర్నోవర్ సాధించింది. మొత్తం వ్యాపారంలో డిజిటల్ విభాగం వాటా 31 శాతానికి చేరినట్లు ఇన్ఫోసిస్ పేర్కొంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆపరేటింగ్ మార్జిన్ 22 శాతం నుంచి 24 శాతం వరకు ఉండొచ్చని ఇన్ఫోసిస్ ప్రకటించింది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్