పోస్టుమార్టం కోసం కూతురు మృతదేహంతో 8కిమీ.. నడిచిన తండ్రి
- October 18, 2018
ఒడిశా:ఒడిశాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. వాహనానికి డబ్బులు లేక పోస్టుమార్టం కోసం కన్న కూతురి మృతదేహాన్ని 8 కిలోమీటర్ల మోసుకెళ్లాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఒడిశాలోని గజపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఇటీవల తితలీ తుఫాన్ గజపతి జిల్లాను తీవ్రంగా కుదిపేసింది. తుఫాను దాటికి సర్వం కోల్పోయిన వారిలో అతంక్పూర్ గ్రామానికి చెందిన ముకుంద్ కుటుంబం కూడా ఒకటి. ఉండే ఇల్లు కూలిపోయింది, నాలుగు రోజులుగా ఆహరం లేదు. ఇదిలావుంటే గత ఆదివారం ముకుంద్ తన పదకొండేళ్ల కూతురు బబిత కనిపించకుండా పోయింది. ఆమె ఊరు శివారులో కొండచరియలు విరిగిపడి చనిపోయిందని తెలిసింది. దాంతో వరద కష్టాల్లో ఉన్న ముకుంద్ కుటుంబం మరింత విషాదంలో మునిగిపోయింది. బబిత మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం చెయ్యడం కోసం ఆసుపత్రికి తీసుకురావాలని తండ్రికి సూచించారు. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ముకుంద్.. వాహనానికి డబ్బులు లేక కూతురు మృతదేహాన్ని 8 కిలోమీటర్లు మోసుకెళ్లాడు. ఇంతలో సమీప గ్రామ ప్రజలు విచారించగా వాహనం సమకూర్చుకోవడానికి తన దగ్గర డబ్బులు లేకపోవడంతో.. ఇలా రావలసి వచ్చిందని సమాధానం చెప్పాడు. దాంతో చలించిపోయిన గ్రామస్థులు కొందరు.. వెంటనే వాహానం ఏర్పాటు చేసి హాస్పిటల్ కు తరలించారు. కాగా బబిత ఘటనపై విమర్శలు రావడంతో అధికారులు విచారణకు ఆదేశించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!