విజిట్, టూరిస్ట్ వీసా.. ఆరు నెలల పొడిగింపు
- October 20, 2018
యూఏఈ: యూఏఈ వీసా సిస్టమ్‌లో కొత్త మార్పులు విజిట్, టూరిస్ట్ వీసాదారులకు మరింత వెసులుబాటు కల్పించనున్నాయి. విజిట్ లేదా 30 రోజుల టూరిస్ట్ వీసా ఉన్నవారికి అదనంగా రెండు సార్లు ఎక్స్టెన్షన్ (మొత్తంగా 60 రోజులు) పెంచుకునేందుకు కొత్త మార్పులు వెసులుబాటు కల్పిస్తున్నాయి. 3 నెలల విజిట్ వీసా లేదా 1 నెల టూరిస్ట్ వీసా ఉన్నవారు ఆ గడువు పూర్తయ్యాక దేశం విడిచి వెళ్ళాల్సి వుండేది. తాజా మార్పుల తర్వాత 30 రోజుల గడువు ముగిసిన వీసాదారులు ఆ తర్వాత రెండు సార్లు దాన్ని పొడిగించుకోవచ్చని ఫారిన్ ఎఫైర్స్ అండ్ పోర్ట్స్ - ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్ షిప్ - యాక్టింగ్ జనరల్ డైరెక్టర్ బ్రిగేడియర్ సయీద్ రకాన్ అల్ రషిది చెప్పారు. ఉద్యోగార్థులు ఈ వెసులుబాటుతో మరింత ఎక్కువ కాలంలో యూఏఈలో వుండి తమ ప్రయత్నాలు చేసుకోవడానికి వీలుంటుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







