'శ్వాస' మొదలు
- October 21, 2018యువ హీరో నిఖిల్ సిద్ధార్థ సరికొత్త ప్రాజెక్టుతో ముందుకొచ్చాడు. దసరా రోజున తన కొత్త మూవీ 'శ్వాస' ను లాంచ్ చేశాడు. ఈ చిత్రంతో కిషన్ కట్టా అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తున్నానని ఈ సందర్భంగా తెలిపాడు. ఇందులో తనది డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్ అని, తన గత చిత్రాలతో పోలిస్తే ఇది పూర్తి వెరైటీ సబ్జెక్ట్‌తో కూడిన సినిమా అని నిఖిల్ చెప్పాడు.
ఈ టైటిల్ స్టోరీకి అతికినట్టు సరిపోతుందని చెప్పిన నిఖిల్, ఎప్పుడూ టాలెంట్ ఉన్న యువ దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయాలన్నదే తన తపన అని పేర్కొన్నాడు. ఈ సినిమాలో నిఖిల్‌కి జోడీగా నివేదా థామస్ నటిస్తోంది. అన్నట్టు.. 'నా ముద్ర' చిత్రం షూటింగ్ ఈ మధ్యే ముగిసింది. తమిళ సినిమా 'కణితన్'కు ఇది రీ-మేక్. అయితే తెలుగు ఆడియెన్స్ అభిరుచులకు అనుగుణంగా స్క్రిప్టులో చాలా మార్పులు చేశాం. ఈ మూవీ వచ్చేనెలలో విడుదల కానుంది' అని నిఖిల్ వెల్లడించాడు.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్