సౌదీకి అండగా బహ్రెయిన్‌

- October 21, 2018 , by Maagulf
సౌదీకి అండగా బహ్రెయిన్‌

జస్టిస్‌, ట్రాన్స్‌పరెన్సీ, ఫెయిర్‌నెస్‌ విషయంలో సౌదీ కింగ్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ అల్‌ సౌద్‌ ఎప్పుడూ ముందుంటారనీ, ఈ విషయంలో సౌదీ అరేబియాని ప్రశ్నించడానికి లేదని బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌ అభిప్రాయపడింది. సౌదీ సిటిజన్‌ జమాల్‌ ఖష్తోగీ విషయంలో జరుగుతున్న దుష్ప్రచారం బాధాకరమని బహ్రెయిన్‌ పేర్కొంది. ఖష్తోగీ విషయమై సౌదీ అరేబియా చూపుతున్న పారదర్శకత తమకు కనిపిస్తోందని కింగ్‌డమ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. కొందరు చేస్తున్న దుష్ప్రచారంతో సౌదీ అరేబియాపై మచ్చ పడబోదనీ, ఈ పరిస్థితుల్లో బహ్రెయిన్‌ కింగ్‌డమ్‌ పూర్తి మద్దతు సౌదీ అరేబియాకేనని ఆ ప్రకటనలో ప్రస్తావించడం జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com