నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు బీభత్సం.. చిన్నారి పరిస్థితి విషమం
- October 22, 2018సికింద్రాబాద్‌లో గత రాత్రి సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు కారు బీభత్సం సృష్టించింది. ఇంపీరియల్ గార్డెన్ వద్ద ఈ ఘటన జరిగింది. రాంగ్రూట్లో దూసుకొచ్చిన దగ్గుబాటి కారు… అదుపు తప్పి బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై వెళ్తున్న దంపతులతో పాటు చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన దగ్గుబాటి సురేష్‌కు 41A నోటీసులు ఇచ్చారు పోలీసులు.
ప్రమాద సమయంలో ఆయనే స్వయంగా కారుని నడిపినట్లు తెలుస్తోంది. సురేశ్ బాబు కారు ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దానిపై సురేశ్ చంద్ర, ఆయన భార్య దుర్గాదేవి, వారి కుమారుడు సిద్ధేశ్ గాయపడ్డారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దుర్గాదేవికి స్వల్పగాయాలు కావడంతో ఆమెకు చికిత్స చేసి డిశ్చార్జి చేశారు. చంద్రకు కాలికి గాయం కావడంతో చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో కారు వేగం 100 కిలోమీటర్లపైనే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడాన్ని బట్టి కారు వేగాన్ని అంచనా వేసినట్లు చెబుతున్నారు.
ప్రమాదం జరిగినట్లు పోలీసులకు తెలియజేసిన సురేష్ బాబు అతనే స్వయంగా క్షతగాత్రులను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. కారును పోలీస్ స్టేషన్లో అప్పగించి పూచీకత్తుపై వెళ్లినట్లు పోలీసులు తెలియజేసారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్