జబెల్ జైస్‌లో గ్రాఫిటీ: 500 దిర్హామ్‌ల జరీమానా
- October 22, 2018
జబెల్ జైస్‌లోని రాక్స్‌పై ఉర్దూలో రాసిన ఓ లవ్ పోయెమ్‌కి 500 దిర్హామ్‌ల జరీమానా విధించారు. రస్ అల్ ఖైమా, పబ్లిక్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్స్ 'రకీబ్' డివిజన్, గ్రాఫిటీ రాతలు, చిత్రాలకు జరీమానా తప్పదని హెచ్చరించడం జరిగింది. జరీమానా ఎదుర్కొన్న గ్రాఫిటీపై ప్రేమకు చిహ్నాలైన హార్ట్ సింబల్స్‌ని, వాటికి జతగా ఓ బాణాన్నీ, అలాగే ఓ మహిళ ఫేస్‌నీ చిత్రీకరించినట్లు వివరించింది. జబెల్ జైస్ ప్రాంతంలో ప్రకృతి అందాల్ని చెడగొట్టేలా గ్రాఫిటీ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వుంటుందని అన్నారు. రకెబ్ సూపర్‌వైజర్ వాయెల్ అలి అబ్దెల్ బారి మాట్లాడుతూ, భారత్ - పాక్ మధ్య స్నేహ సంబంధాల కోసం కొందరు ఇలాంటివి చేస్తున్నట్లు చెప్పారు. ఉద్దేశ్యం మంచిదే అయినా, ఇలాంటి చర్యల్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. యూరోపియన్ టూరిస్టులు, తమ పేర్లను, అలాగే డేట్స్‌ని రాస్తుంటారని ఆయన వివరించారు. నేషనల్ హాలిడేస్, వీక్లీ ఆఫ్ రోజుల్లో ఇలాంటి ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతుంటాయి.
తాజా వార్తలు
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ