వెదర్‌ అప్‌డేట్‌: అత్యల్ప ఉష్ణోగ్రత 13.5 డిగ్రీల సెల్సియస్‌

- October 24, 2018 , by Maagulf
వెదర్‌ అప్‌డేట్‌: అత్యల్ప ఉష్ణోగ్రత 13.5 డిగ్రీల సెల్సియస్‌

నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ మెటియరాలజీ, సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయనీ, సముద్రం రఫ్‌గా వుంటుందని హెచ్చరించింది. కెరటాలు 6 అడుగుల మేర పైకి ఎగసిపడే అవకాశం వున్నందున యూఏఈలో బీచ్‌ గోయర్స్‌ అప్రమత్తంగా వుండాలని పేర్కొంది. ఓవరాల్‌గా చూస్తే యూఏఈలో వెదర్‌ ఫెయిర్‌గా వుంటుంది. అక్కడక్కడా మేఘాలు ఫామ్‌ అయ్యే అవకాశం వుంది. మంగళవారం అత్యధికంగా 38.2 డిగ్రీల ఉష్ణో&గ్రత నమోదయ్యింది. అత్యల్ప ఉష్ణోగ్రత 13.5 డిగ్రీల సెల్సియస్‌కి చేరుకుంది. రాత్రి వేళల్లో, పగటి వేళల్లో హ్యుమిడిటీ ఎక్కువగా వుండొచ్చు. ఒమన్‌ సీ, అరేబియన్‌ గల్ఫ్‌లలో సముద్రం రఫ్‌ నుంచి మోడరేట్‌ స్థాయికి చేరుకోవచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com