యాక్సిడెంట్ విక్టిమ్‌కి హాస్పిటల్ బిల్లు నుంచి ఉపశమనం
- October 24, 2018
27 ఏళ్ళ భారతీయ వలసదారుడు సజీర్ కోలాతముకుయిల్ హాస్పిటల్ బిల్‌ని వెయివ్ చేయడం జరిగింది. ఉమ్ అల్ కువైన్‌లోని షేక్ ఖలీఫా హాస్పిటల్ మేనేజ్మెంట్, డాక్టర్ల టీమ్ ప్రత్యేకంగా ఈ కేసుని పరిగణించి, బిల్లు నుంచి బాధితుడికి ఉపశమనం కల్పించారు. క్రానియోప్లాస్టీ (స్కల్ సర్జరీ), ఫ్రాక్చర్స్, ఇతర వైద్య చికిత్సలకు సంబంధించి బిల్లుని వెయివ్ చేశారు. మూడు నెలలపాటు సజీర్కి పలు రకాలైన సర్జరీలను నిర్వహించారు. ప్రస్తుతం సజీర్ కోలుకోవడంతో, అతన్ని డిశ్చార్జి చేయనున్నారు. ఆగస్ట్ 14న సజీర్ ఆసుపత్రిలో చేరారు. సోదరుడితో కలిసి వెళుతుండగా సజీర్ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో సజీర్ సోదరుడు సాజిద్ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సజీర్కి తీవ్ర గాయాలయ్యాయి. సోదరులిద్దరూ కేరళలోని కోజికోడ్‌కి చెందినవారు. సాజిద్ వాహనాన్ని నడుపుతున్నాడు. వాహనం అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సాజిద్ మృతదేహాన్ని కేరళకు ఆగస్ట్ 16న పంపడం జరిగింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!