దుబాయ్ టూరిస్టులు వ్యాట్ని వెనక్కి పొందే అవకాశం
- October 25, 2018
యూఏఈ అధికారులు తాజాగా వెల్లడించిన ఇనీషియేటివ్ ప్రకారం దుబాయ్ టూరిస్టులు వ్యాట్ని వెనక్కి పొందేందుకు అవకాశం వుంది. నవంబర్ 18 నుంచి, దుబాయ్‌లో కొనుగోలు చేసే పలు రకాలైన వస్తువులపై వాల్యూ యాడెడ్ టాక్స్‌ని టూరిస్టులు వెనక్కి పొందవచ్చు. జనవరిలో పలు రకాలైన ప్రోడక్ట్స్‌పై 5 శాతం వ్యాట్ యూఏఈలో అమల్లోకి వచ్చిన సంగతి తెల్సిందే. అబుదాబీ, దుబాయ్, షార్జా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్‌లో ఫస్ట్ ఫేజ్‌ని అమలు చేస్తున్నట్లు ఫెడరల్ ట్యాక్స్ అథారిటీ వెల్లడించింది. దాంతో, నవంబర్ 18 నుంచి జారీ చేసే ఇన్వాయిస్లపై ట్యాక్స్ రిఫండ్ని టూరిస్టులు పొందడానికి వీలుంటుంది. ఈ సిస్టమ్‌తో యూఏలోని 4,000 షాప్‌లు, రిటెయిల్ ఔట్లెట్స్ కనెక్ట్ అయ్యే అవకాశం వుంది. అలా కనెక్ట్ అయ్యే షాప్‌లు, ఔట్లెట్స్.. వ్యాట్ రిఫండ్‌పై సమాచారాన్ని డిస్ప్లే చేస్తాయి కూడా. గ్లోబల్ టూరిజం మార్కెట్లో యూఏఈ ఈ నిర్ణయంతో మరింతగా రాణిస్తుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్