ఎన్టీఆర్ బయోపిక్ చైతన్య రథం రెడీ..

- October 25, 2018 , by Maagulf
ఎన్టీఆర్ బయోపిక్ చైతన్య రథం రెడీ..

బాలకృష్ణ మెయిన్ రోల్ చేస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. సంక్రాంతిని టార్గెట్ చేసిన ఈ సినిమా రెండు పార్ట్ లుగా వస్తున్న సంగతి తెలిసిందే. సినిమా రంగానికి చెందిన పార్ట్ 1 ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. రాజకీయ రంగానికి చెందిన సినిమా పార్ట్ 2 మహానాయకుడు కొంతభాగం మిగిలి ఉన్నట్టుగా సమాచారం.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక.. చైతన్యు రథాన్ని ప్రత్యేకంగా తయారు చేయించుకొని దానిపైనే అప్పటి ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటించారు. ఈ మహానాయకుడు కోసం అచ్చంగా అలాంటి చైతన్య రథాన్ని తయారు చేశారు. దీనిపైనే ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న బాలకృష్ణ ఎన్నికల ప్రచార పర్వానికి సంబంధించిన షూటింగ్ ను చేయనున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ మహానాయకుడుకు చెందిన చైతన్య రథం ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com