ట్రక్ ఢీకొని సైక్లిస్ట్ మృతి
- October 27, 2018
ఆసియాకి చెందిన 41 ఏళ్ళ వ్యక్తి ట్రక్ ఢీకొనడంతో మృతి చెందాడు. రస్ అల్ ఖైమాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉదయం 9 గంటల సమయంలో ఓ వ్యక్తి సైకిల్ మీద వెళుతుండగా, ఓవర్ టర్న్ అయిన ట్రక్ కారణంగా అతను మృతి చెందినట్లు మామురా పోలీస్ స్టేషన్ చీఫ్ కల్నల్ వలీద్ కాన్ఫాష్ పేర్కొన్నారు. సంఘటన గురించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్ పెట్రోల్, అంబులెన్స్, పారామెడిక్స్, రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు పేర్కొన్నారు అధికారులు. భారీ ట్రక్కుని 34 ఏళ్ళ ఆసియా వ్యక్తి నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనం అదుపు తప్పడమే ఈ ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. తీవ్ర గాయాలు కావడంతో, రక్తస్రావం ఎక్కువగా జరిగి సైక్లిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. మృతదేహాన్ని హాస్పిటల్ మార్గ్కి తరలించారు. వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా వుండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!