భారత్‌కు విండీస్ షాక్..
- October 27, 2018
భారత టూర్లో వెస్టిండీస్ ఎట్టకేలకు తొలి విజయాన్ని రుచి చూసింది. పుణే వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియాకు షాకిచ్చింది. ఆసక్తికరంగా సాగిన పోరులో కరేబియన్ టీమ్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 283 పరుగులు చేసింది. ఒక దశలో 150 కూడా దాటదనుకున్న ఆ జట్టు హోప్ సూపర్ ఇన్నింగ్స్‌తో కోలుకుంది.
ఛేజింగ్‌లో భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. కోహ్లీ తప్పిస్తే… మిగిలిన బ్యాట్స్‌మెన్ క్రీజులో నిలవలేదు. తన సూపర్ ఫామ్ కొనసాగించిన కోహ్లీ 38వ సెంచరీతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. కోహ్లీ 107 పరుగులకు ఔటయ్యాక.. టెయిలెండర్లు చేతులెత్తేయడంతో భారత్ 240 పరుగులకు ఆలౌటైంది. దీంతో సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..