ఎన్నారైలకు సమాచార హక్కు..!
- October 29, 2018
దిల్లీ: ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం కావాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం భారతీయులకు మాత్రమే ఆ అవకాశం ఉంది. ఇక నుంచి ప్రవాస భారతీయులు(ఎన్నారై)కు కూడా ఆర్టీఐ కింద పాలనా పరమైన అంశాల సమాచారం కోరవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రటకించింది. దీనికి సంబంధించిన సవరణలను చేసింది.
'సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం.. కేవలం భారతీయ పౌరులకు మాత్రమే ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకునే హక్కు ఉంది. ఎన్నారైలు అందుకు అర్హులు కాదు' అని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోక్సభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో పేర్కొన్న విషయం తెలిసిందే. కానీ దీన్ని లోకేష్ బత్రా అనే సామాజిక కార్యకర్త వ్యతిరేకించారు. ఈ మేరకు కేవలం భారతీయుడికి మాత్రమే సహ చట్టం ద్వారా అన్ని విషయాలను తెలుసుకునే అవకాశం ఉంటుందని పేర్కొంటూ ఆయన సంబంధిత మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఈ మేరకు దీన్ని మరోసారి పరిశీలించిన ప్రభుత్వం ఎన్నారైలకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇప్పుడు ఎన్నారైలు కూడా సహ చట్టం ద్వారా పాలనా పరమైన విషయాలను తెలుసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సవరించిన విధానాన్ని లోక్సభ వెబ్సైట్లో పొందుపరిచింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!