గ్రూప్‌ ఫైట్‌: మహిళ మృతి, ఐదుగురికి గాయాలు

- October 29, 2018 , by Maagulf
గ్రూప్‌ ఫైట్‌: మహిళ మృతి, ఐదుగురికి గాయాలు

32 ఏళ్ళ నేపాలీ మహిళ హత్యకు గురయ్యింది. షార్జాలోని ఓ వర్కర్స్‌ అకామడేషన్‌లో తలెత్తిన ఘర్షణ ఈ హత్యకు దారి తీసింది. ఇండస్ట్రియల్‌ ఏరియా నెంబర్‌ 12 అకామడేషన్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో మరో నలుగురు మహిళా క్లీనర్స్‌ కూడా గాయపడ్డారు. మానసిక స్థితి సరిగా లేని ఓ మహిళ ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. గాయపడ్డ నలుగురు మహిళల్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని అటాప్సీ నిమిత్తం ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపించడం జరిగింది. గాయపడ్డవారి పరిస్థితి నిలకడగా వుందని వైద్యులు తెలిపారు. బాధ్యురాలైన క్లీనర్‌ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com