అబుదాబీ రెండో ఇల్లు: సల్మాన్‌ఖాన్
- October 29, 2018
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్, అబుదాబీని తన రెండో ఇల్లుగా పేర్కొన్నాడు. తన కొత్త సినిమా 'భారత్' షూటింగ్ సందర్భంగా అబుదాబీలో సందడి చేస్తోన్న సల్మాన్‌ఖాన్, 15 రోజుల పాటు సాగే షెడ్యూల్ పనుల్లో బిజీగా వున్నాడు. లివా డిజర్‌ట& ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతోంది. సుమారు 200 మంది ఈ షూటింగ్ కోసం కష్టపడుతున్నారు. ఇండియా, సిరియా, జర్మనీ, యెమెన్, యూఏఈకి చెందిన పలువుర్ని 'భారత్' టీమ్ ఎంపిక చేసుకుంది. స్థానికంగా వున్నవారి నుంచి కొందర్ని ఎంపిక చేసుకున్న 'భారత్' టీమ్, 1,400 మంది ఎక్స్‌ట్రాస్‌ని కూడా తీసుకుంది. 'భారత్' సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా సల్మాన్‌ఖాన్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా. సల్మాన్‌ఖాన్‌ని చూసేందుకు యూఏఈ ఆసక్తి చూపుతున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









