భారత్-జపాన్ మధ్య పలు కీలక ఒప్పందాలు
- October 29, 2018
హైస్పీడ్ రైలు ప్రాజెక్టు, నావికా రంగ సహకారంతో సహా భారత్-జపాన్లు సోమవారం ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రెండు దేశాల మంత్వ్రి స్థాయిలో 2+2 చర్చలు నిర్వహిం చేందుకు అంగీకరించాయి. ప్రధాని మోడి, జపాన్ ప్రధాని షింజో అబే మధ్య సోమవారం టోక్యోలో జరిగిన చర్చల అనంతరం ఈ ఒప్పందాలపై రెండు దేశాల నేతలు సంతకాలు చేశారు. భారత్-పసిఫిక్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితితో సహా పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలి రువురు చర్చించారు. ప్రపంచంలో శాంతి స్థిరత్వాల కోసం రెండు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు, రక్షణ మంత్రులతో మంత్రిత్వ స్థాయిలో 2+2 చర్చలు నిర్వహిం చాలని తాము ఒక అంగీకారానికి వచ్చినట్లు మోడి తెలిపా రు. భారత్-జపాన్ల మధ్య 13వ ద్వైపాక్షిక సదస్సు సందర్భంగా ఇక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోడి మాట్లాడుతూ పైవిషయాలు తెలిపారు. దాదాపు 75 బిలియన్ డాలర్ల నోట్ల మార్పిడి ఒప్పందం కూడా రెండు దేశాల మధ్య జరిగిందని తెలిపారు. భారత్లో 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్లో మదుపుదారులు ప్రకటించారని మోడి చెప్పారు. ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ప్రాజెక్టు పురోగతిపై కూడా తాము చర్చించుకున్నట్లు ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్