2,600 కిలోలకు పైగా తేనె స్వాధీనం

- October 30, 2018 , by Maagulf
2,600 కిలోలకు పైగా తేనె స్వాధీనం

మస్కట్‌:2,670 కిలోల తేనె (హనీ)ను మస్కట్‌ మునిసిపాలిటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తేనె తయారు చేస్తున్న, విక్రయిస్తున్న కేంద్రాలపై జరిపిన దాడుల్లో ఈ తేనె బయట పడింది. రువిలోని ఓ ఇంటిలో దీన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. 30 కిలోల బరువు తూగే 89 కంటెయినర్స్‌తోపాటు, 134 బాటిల్స్‌ని ఈ సందర్భంగా అధికారులు సీజ్‌ చేయడం జరిగింది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌తో కలిసి డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ గ్రేటర్‌ ముట్రా, రువిలోని ఓ ఇంటిపై దాడి చేసి అక్రమంగా తయారు చేస్తున్న హనీని స్వాధీనం చేసుకున్నట్లు మస్కట్‌ మునిసిపాలిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా పలువుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com