ప్రైవేట్‌ కార్లపై నిషేధం!

- October 30, 2018 , by Maagulf
ప్రైవేట్‌ కార్లపై నిషేధం!

ఢిల్లీలో కాలుష్య స్థాయి డెంజర్ బెల్స్‌ను మోగిస్తున్నాయి. మంగళవారం ఉదయం మరింత అధికమై ఈ సీజన్‌లో అత్యధిక స్థాయికి చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది.ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 397గా నమోదైంది. దీంతో అధికారులు నష్టనివారణ చర్యలు చేపడుతున్నారు. కాలుష్య సమస్య మరింతంగా పెరిగితే నవంబర్ 1 నుంచి ప్రైవేట్‌ కార్లపై నిషేధం విధించనున్నట్లు ఈపీసీఏ చైర్మన్‌ భూరేలాల్‌ తెలిపారు.

పొరుగురాష్ట్రాల్లోని రైతులు ఖరిఫ్ సాగుకు సిద్దమవుతున్నారు. దీంతో యథేచ్చగా పంట పొలాల్లో ఉన్న గడ్డికి నిప్పు పెడుతుండడం వలన ఢిల్లీలో కాలుష్య స్ధాయి పెరిగిపోతుంది. నగరంలో 17 చోట్ల ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ తీవ్రమైన స్థాయికి చేకుందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు డేటా తెలిపింది. కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశంపై గవర్నర్‌ అనిల్‌ బైజల్.. ఢిల్లీ పర్యావరణ మంత్రి ఇమ్రాన్‌ హుస్సేన్,ఈపీసీఏ అధికారులతో కలిసి చర్చించారు. నిర్మాణ పనులపై నిషేధం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రజలు ఎక్కువగా ఉపయోగించుకోనే విధంగా అవగాహన కల్పించడం, సమస్య మరింత జటలిమైతే ప్రవేట్ కారులను నిషేందించాలి, ఎత్తైన భవనాల నుంచి నీరు చిలకరించడం, వంటి చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com