ఫుల్ జోరు మీద ‘శరభ’
- October 31, 2018డాక్టర్ జయప్రద ప్రధాన పాత్రలో ఆకాష్ కుమార్, మిష్టి చక్రవర్తి జంటగా ఎకెయస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై యన్.నరసింహారావు దర్శకత్వంలో అశ్వని కుమార్ సహదేవ్ నిర్మిస్తున్న శరభ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 15 న విడుదల కు సిద్ధమయింది.
జయప్రద దశావతారం సినిమా తరువాత నటిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.. ఆమె తన కెరియర్ లో చేయనటువంటి వైవిధ్యమైన పాత్రను పోషించింది. అలాగే తమిళ నటుడు నెపోలియన్ నాగార్జున హలో బ్రదర్ సినిమా తరువాత ఈ సినిమాలో వైవిధ్యమైన విలన్ గా నటిస్తున్నాడు. అలాగే నటుడు నాజర్ … మెరుపు కలలు తరువాత ఈ సినిమాలో ఒక హాస్య పాత్ర పోషించడం విశేషం యల్. బి. శ్రీరామ్ ఒక వైవిధ్యమైన పాత్ర చేశారు. ఈ సినిమాలో ని పాత్రకు ఒక ప్రత్యేకత ఉంది ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నయన్. నరసింహారావు గతంలో తమిళ నటుడు శంకర్ వద్ద అపరచితుడు సినిమా నుండి శివాజీ,,రోబో,, ఐ చిత్రాల వరకు దర్శకత్వ శాఖలో పని చేశాడు .
తదనంతరం దిల్ రాజు కంపెనీలో స్టోరీ విభాగంలో కొంత కాలం పని చేశాడు. దర్శకుడు ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఇది చందమామ కథల తరహాలో అందరికి తెలిసిన విధంగా అందరూ ఆసక్తి గా చూసే విధంగా ఉంటుంది. ఇది పూర్తిగా కమర్షియల్ ఎంటర్ టైనర్ .. నిర్మాత సినిమా మీద మోజుతో దుబాయ్ నుండి వచ్చారు.. సినిమాకు అవసరమయ్యే విధంగా కర్చుకు వెనకాడ కుండా భారీ ఎత్తున ఖర్చు పెట్టారు.
ఈ సినిమా 40 నిముషాల సీజీ వర్క్ ఉంటుంది. దాదాపు 12662 షాట్స్ సీజీ లో చేశాము. నేను ఐ సినిమాకు దర్శకత్వ శాఖలో పని చేస్తున్నప్పుడు ఆ సినిమాకు మేకప్ ఇన్ ఛార్జ్ అయిన న్యూ.జిల్యాండ్ కు చెందిన షాన్ ఫుట్ అనే మేకప్ మ్యాన్ ఈ సినిమాకు ప్రాస్త టిక్ మేకప్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ హీరో నరసింహ స్వామి అవతారం ఎత్తుతాడు ఆ వర్క్ కోసం ఆయన చాలా కాలం వెయిట్ చేశారు.. సినిమా చాలా బాగా వచ్చింది. అన్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు